Subscribe:

Ads 468x60px

twn social links

blogger widget

Monday, 6 October 2014

స్మార్ట్ ట్రెండ్ కు అనుగుణంగా స్మార్ట్ ఐ ఫోన్ 6


తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్; స్మార్ట్ ట్రెండ్ కు అనుగుణంగా యాపిల్ లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 6ను రూ.56,000 ధర పరిధిలో అందిస్తామంటూ ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు ప్రకటనలు గుప్పిస్తున్నాయి. ఇండియన్ మార్కెట్లో ఐఫోన్ 6 విడుదలకు సంబంధించి యాపిల్ ఇప్పటి వరకు ఏ విధమైన అధికారిక ప్రకటనను జారీ చేయలేదు. అయినప్పటికి, పలు ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు అక్టోబర్ రెండవ వారం నుంచి యాపిల్ ఐఫోన్ 6ను రూ.56,000 ధర శ్రేణిలో విక్రయిస్తామంటూ ఆన్‌లైన్ షాపర్‍‌లను ఊరిస్తున్నాయి.
మరిన్ని ఫోటోలు...
పని చేసే సామర్థ్యం...



ప్రముఖ రిటైలర్ ఈబే (eBay) ఐఫోన్ 6ను ఈ అక్టోబర్ 8 నుంచి ఏ విధమైన డెలివరీ చార్జీలను వసూలు చేయకుండా రూ.55954 ధరకే అందిస్తామని తెలిపింది. ఐఫోన్ 6 ప్లస్ ధరను రూ.77,000 సదరు రిటైలర్ పేర్కొంది. 
మరో వెండర్ షాప్‌క్లూస్.కామ్ ఐఫోన్ 6 16జీబి వర్షన్‌ను అక్టోబర్ 8 నుంచి రూ.149 డెలివరీ చార్జీలతో కలుపుకుని రూ.59,999 ధరకు విక్రయిస్తామని తెలిపింది. 
యాపిల్ ఐఫోన్ 6 ప్రత్యేకతలు: ఫోన్ బరువు 129 గ్రాములు, చుట్టుకొలత 138.10 x 67.00 x 6.90 మిల్లీ మీటర్లు, ఫోన్ మందం 6.9 మిల్లీ మీటర్లు, 4.7 అంగుళాల తాకేతెర (రిసల్యూషన్ 750x1334 పిక్సల్స్, 326 పీపీఐ), ఐఓఎస్ 8.0 ప్లాట్‌ఫామ్, యాపిల్ ఏ8 ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ఐసైట్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, సింగిల్ సిమ్ కనెక్టువిటీ (జీఎస్ఎమ్ నానో సిమ్), ఇతర కనెక్టువిటీ ఫీచర్లు (4జీ,3జీ, వై-పై, జీపీఎస్, బ్లూటూత్, ఎన్ఎఫ్ సీ), సెన్సార్లు (పాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరో స్కోప్, బారో మీటర్), 1810 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఐఫోన్ 6 స్మార్ట్‌ఫోన్‌ను యాపిల్ 16జీబి, 64జీబి, 128జీబి స్టోరేజ్ వేరియంట్‌లలో అందిస్తోంది. లభ్యమయ్యే ఫోన్ కలర్ వేరియంట్స్ (సిల్వర్, గోల్డ్, స్పేస్ గ్రే). యాపిల్ ఐఫోన్ 6 ప్లస్ ప్రత్యేకతలు: ఫోన్ బరువు 172 గ్రాములు, చుట్టుకొలత 158.10 x 77.80 x 7.10 మిల్లీమీటర్లు, ఫోన్ మందం 7.1 మిల్లీ మీటర్లు, 5.5 అంగుళాల తాకేతెర (రెటీనా హైడెఫినిషన్ డిస్‌ప్లే రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్, 401 పీపీఐ), ఐఓఎస్ 8.0 ప్లాట్‌ఫామ్, యాపిల్ ఏ8 ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ఐసైట్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, సింగిల్ సిమ్ కనెక్టువిటీ (జీఎస్ఎమ్ నానో సిమ్), ఇతర కనెక్టువిటీ ఫీచర్లు (4జీ,3జీ, వై-పై, జీపీఎస్, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ), సెన్సార్లు (పాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరో స్కోప్, బారో మీటర్), బ్యాటరీ సామర్థ్యం .
 ఐఫోన్ 6 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను యాపిల్ 16జీబి, 64జీబి, 128జీబి స్టోరేజ్ వేరియంట్‌లలో అందిస్తోంది. 

0 comments:

Post a Comment